ప్రధాని మోదీ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని ఏఐసీసీ అధికార ప్రతినిధి శక్తిసింగ్ గోయెల్ ఆరోపించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండేదన్నారు. యూపీఏ హయాంలో ప్రపంచ అయిదు దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగిందని పేర్కొన్నారు. దేశం ఆర్థికంగా పతనమవుతుంటే... ప్రజల దృష్టి మళ్లించడానికే సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు.
దేశమంతటిని అస్సాం చేస్తారా ?
అస్సాంలో మాదిరిగానే దేశ వ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలుకు కేంద్రం సిద్ధమవుతోందని మండిపడ్డారు. మోదీ తన డిగ్రీ పట్టాలను చూపించేందుకు ముందుకు రారని... కానీ దేశ ప్రజలను మాత్రం తమ జన్మ హక్కు పత్రం చూపించమంటున్నారని మండిపడ్డారు.
ఇవీ చూడండి : ' కేసీఆర్కు మున్సిపల్ ఎన్నికల భయం పట్టుకుంది'