లాక్ డౌన్ నేపథ్యంలో.. తిరుమలగిరిలోని పేదప్రజలకు కంటోన్మెంట్ తెరాస నాయకుడు రవీంద్ర గుప్త నిత్యవసర సరకులను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పేదలకు ఆసరాగా నిలవాలనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
గత 50 రోజులుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొటేందుకు ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: ఇంటర్ మూల్యాంకనం చేసే అధ్యాపకుల ఆందోళన