రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యను టీఎన్జీవో నాయకులు తీవ్రంగా ఖండించారు. కార్యాయలంలోనే తహశీల్దార్‌ను సజీవ దహనం చేయడం అత్యంత దారుణ సంఘటన అని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ అభిప్రాయపడ్డారు. హత్యకు కారకులైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా... ఉద్యోగులకు ధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముజీబ్ పేర్కొన్నారు.
ఇవీచూడండి: అమానుషం... అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ దారుణ హత్య