అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన పీఆర్సీ ప్రకటనపై టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఏ రాష్ట్రంలో లేనట్టుగా.. మెరుగైన ఫిట్మెంట్ను ప్రకటిస్తామని తెలియజేయడం ఉద్యోగులందరినీ సంతోషంలో ముంచెత్తిందన్నారు రాజేందర్. తెరాసది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని తమకు ముందే తెలుసన్నారు.
ఇదీ చదవండి: సర్కారుపై లక్ష కోట్ల భారం అయినా పీఆర్సీ ఇస్తాం: సీఎం కేసీఆర్