పీఆర్సీ విషయంలో కొన్ని ఉద్యోగ సంఘాలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం గ్రేడ్-2 లైబ్రేరియన్‌గా పనిచేసిన దేవేందర్ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వంతో చర్చల ద్వారానే ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని పీఆర్సీ అంశంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని రాజేందర్ అన్నారు. ఈ బాధ్యత టీఎన్జీవోపై ఉందన్న ఆయన అందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. కాగితంపై ఉండే యూనియన్లతో కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని.. అతి త్వరగా ప్రభుత్వంతో చర్చలు పూర్తి అయ్యే అవకాశాలు లేకపోలేదన్నారు. లైబ్రరీ ఉద్యోగులకు సంబంధించిన జీరో వన్ జీరో జీవో సాధనకు టీఎన్జీవో నిర్మాణాత్మక పోరాటం కొనసాగిస్తుందని వెల్లడించారు.
ఇదీ చదవండి: నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష