రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలంటూ టీఎన్జీవో నాయకులు ప్రజాప్రతినిధులను కలిశారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవితను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.
మంత్రులను కలిసిన వారిలో టీఎన్జీవో రాష్ట్రసంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం రాష్ట్ర కన్వీనర్ హుస్సేని, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.