ETV Bharat / state

'బతుకుదెరువు నిలబెట్టాలి- తెలంగాణను కాపాడాలి' - మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య

'బతుకుదెరువు నిలబెట్టాలి- తెలంగాణను కాపాడాలి' నినాదంతో తెజాస అధ్యక్షుడు కోదండరామ్ 48 గంటల దీక్ష చేపట్టారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

tjs president kodandaram will go on a hunger strike for two days start in hyderabad
'బతుకుదెరువు నిలబెట్టాలి- తెలంగాణను కాపాడాలి'
author img

By

Published : Jan 3, 2021, 1:25 PM IST

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్‌ స్వార్థం కోసం పోరాడటంలేదని... యువకుల కోసం పోరాడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. యువకులంతా నిరుద్యోగంలో ఉన్నారని...ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇవ్వబోతున్నారని తెలిపారు.

నాంపల్లి తెజస కార్యాలయంలో ఆచార్య కోదండరామ్‌ చేపట్టిన 48గంటల దీక్షకు చుక్కా రామయ్య సంఘీభావం తెలిపారు. పాఠశాలలు తెరవక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని రామయ్య పేర్కొన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కోదండరామ్‌ ప్రజల వాణిని వినిపించే వ్యక్తిగా చుక్కా రామయ్య కొనియాడారు.

ఇదీ చూడండి: మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌ను అడుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.