ఉదయం ప్రగతి భవన్ ముట్టడించిన తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాంతో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో... ప్రగతి భవన్ ముందు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం వల్ల ప్రగతి భవన్ ముందు పలువురు నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని కోదండరాం ఖండించారు.
కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ... తమ నిరసనను తెలిపేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కులను మాత్రమే డిమాండ్ చేశామని కోదండరాం తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రేవేటు ఆస్పత్రులకు కొమ్ముకాస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తోందన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి ఇది ఆరంభం మాత్రమేనని, ప్రభుత్వం.. ప్రేవేటు ఆస్పత్రుల ఆగడాలను అడ్డుకోకపోతే.. ప్రజలను ఐక్యం చేసి ఉద్యమిస్తామని కోదండరాం హెచ్చరించారు.
ఇదీ చదవండి: కొత్త సచివాలయ పనులు అక్టోబర్‌లో ప్రారంభించే అవకాశం