ETV Bharat / state

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా తేల్చాల్సిందే: కోదండరాం - TJS President Kodanda Ram Comments

Kodandaram Fires on cm kcr : టీజేఎస్ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణాకు అన్యాయం జరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kodandaram
Kodandaram
author img

By

Published : Jan 11, 2023, 2:28 PM IST

KodandaRam Fires on cm kcr : టీఆర్ఎస్ తెలంగాణ గురించి మాట్లాడుతుందనే ఆశ ఉండేదని.. ఇప్పుడు టీఆర్‌ఎస్ పోయి బీఆర్ఎస్‌ అయిందని టీజేఎస్ అధ్యక్షులు ఆచార్య కోదండరాం అన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలనే డిమాండ్‌తో నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కోదండరాం దీక్ష చేపట్టారు.

సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగే కోదండరాం దీక్షకు హక్కుల నేత ఆచార్య హరగోపాల్ సంఘీభావం తెలిపారు. పోతిరెడ్డిపాడు తూము వెడల్పు చేస్తే తెలంగాణకు నీళ్లు రావని కోదండరాం స్పష్టం చేశారు. ఈ నెల 30న దిల్లీకి వెళ్లి తెలంగాణ వాటా తేల్చాలని కేంద్రాన్ని కోరతామని వెల్లడించారు. కేసీఆర్‌ సర్కారు తెలంగాణ అస్తిత్వాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. తెలంగాణలోని సంపదను రక్షించుకునేందుకు ఆంధ్రా నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆకాంక్షలను కేసీఆర్ విస్మరించారని ఆరోపించిన ఆయన... సీఎంకు చారిత్రక ఉద్యమ స్ఫూర్తిలేదన్నారు. తెలంగాణ ప్రజలను మళ్లీ సమీకరించుకునే పరిస్థితికి తీసుకు వచ్చారని తెలిపారు. జేఏసీని మళ్లీ పునః ప్రారంభించాల్సిన అవసరం వచ్చిందని హరగోపాల్ వెల్లడించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.