దిల్లీలో ఎవరో కూర్చుని ఇక్కడ వైద్య వ్యవస్థను నియంత్రించడం సరికాదని తెజస అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేస్తున్న జూడాలకు తెజస సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గతంలో ఎన్‌ఎంసీ బిల్లు చట్టం కాకుండా అడ్డుకున్నామని చెప్పారు. ఇప్పుడు దాన్ని మార్చే వరకు ఊరుకోబోమని స్పష్టంచేశారు. వైద్య విధానం రాష్ట్రం పరిధి నుంచి కేంద్రం పరిధిలోకి తీసుకునేందుకే ఈ బిల్లు తీసుకొస్తున్నారని వివరించారు.
ఇవీచూడండి: నేడు తీవ్రరూపం దాల్చనున్న జూడాల ఆందోళన