తెలంగాణ జన సమితి మూడో ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండ రాం పలు సూచనలు చేశారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పార్టీ శ్రేణులు వేడుకలు జరుపుకోవాలని కోరారు. రేపు ఉదయం పది గంటలకు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంతో పాటు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో జెండా ఎగురవేయాలని చెప్పారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి: వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకం: డీహెచ్ శ్రీనివాస్