Tirumala Sarva Darshan Tickets: తిరుమల శ్రీవారి సర్వ దర్శన టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించి రోజుకు పది వేల చొప్పున టికెట్లను విడుదల చేసింది. జనవరిలో వైకుంఠ ఏకాదశి ఉండడంతో అధిక సంఖ్యలో భక్తులు టికెట్ల కోసం ప్రయత్నించగా.. 16 నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. వైకుంఠ ఏకాదశి(వైకుంఠ ద్వార దర్శనం) పర్వదినాన్ని పురస్కరించుకుని.. జనవరి 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేల చొప్పున.. మిగిలిన రోజుల్లో రోజుకు 10 వేల చొప్పున టైంస్లాట్ టోకెన్లు విడుదల చేశారు.
రేపు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల విడుదల..
రేపు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తితిదే తెలిపింది. జనవరి, ఫిబ్రవరి కోటాను రేపు మధ్యాహ్నం 3 గం.కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. జనవరి 1న వెయ్యి బ్రేక్ దర్శన టికెట్లు(రూ.500), వైకుంఠ ఏకాదశి, జనవరి 13న జనవరి 13న రోజు వెయ్యి మహాలఘు దర్శన టికెట్ల(రూ.300)ను అందుబాటులో ఉంచనున్నారు. అలాగే జనవరి 14 నుంచి 22 వరకు రోజుకు 2 వేల చొప్పున లఘు దర్శన(రూ.500) టికెట్లు విడుదల చేస్తారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మిగతా రోజుల్లో ఆన్‌లైన్‌లో బ్రేక్ దర్శన టికెట్లను సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున, శని, ఆది వారాల్లో 300 చొప్పున బ్రేక్ దర్శన టికెట్ల(రూ.500)ను విడుదల చేయనున్నారు.
ఇదీ చూడండి: TSRTC employees Retirement : పదవీ విరమణ సమయం ఆసన్నమైనట్టేనా..?