ETV Bharat / state

తిరుమల శ్రీవారి దర్శనంలో భారీ మార్పులు...! - తిరుమల తిరుపతి దేవస్థానం వార్తలు

తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శన విధానాల్లో భారీ మార్పులు జరగనున్నాయి. భక్తులు భౌతిక దూరం పాటించే విధంగా తితిదే ఏర్పాట్లు చేయనుంది.  వైకుంఠం క్యూకాంప్లెక్స్​లోని కంపార్ట్ మెంట్లను పూర్తిగా మూసివేయనున్నారు. భక్తులు క్యూలైన్ల ద్వారా నేరుగా శ్రీవారి ఆలయానికి చేరుకొని దర్శనం చేసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తితిదే వసతి గృహాలను మూసివేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆదేశాలు వస్తే తిరుమల శ్రీవారి ఆలయంలో చోటుచేసుకోనున్న దర్శన మార్పులపై ప్రత్యేక కథనం.

tirumala srivari darshanam latest news
తిరుమల శ్రీవారి దర్శనంలో భారీ మార్పులు...!
author img

By

Published : May 13, 2020, 3:17 PM IST

కరోనా వైరస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్​లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం మీద పడటంతో ఆలయంలోకి భక్తుల ప్రవేశాలు నిషేధించిన విషయం తెలిసిందే. అప్పటినుండి ఇప్పటివరకు స్వామి వారి నిత్య కైంకర్యాలు యధావిధిగా జరుగుతున్నా.. భక్తుల దర్శనాలకు మాత్రం అనుమతి లేదు. లాక్​డౌన్ ఎత్తివేసిన తరువాత తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను ఎలా అనుమతించాలనే అంశంపై తితిదే కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్శన విధానాల్లో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లు, శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో గంటల తరబడి వేచిచూసే భక్తులకు తితిదే అన్న ప్రసాద వితరణ, వసతి గృహాల్లో బస...శ్రీవారి దర్శనంలో సాధారణంగా ఉండే ఈ విధానాలన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మార్చి 20 నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. లాక్‌డౌన్‌ గడువు సమీపిస్తుండటం.. అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల మినహాయింపులు ఇస్తున్న క్రమంలో తితిదే ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తోంది. కరోనా వైరస్‌ ప్రభావం పూర్తిగా తగ్గేవరకు భౌతిక దూరం పాటిస్తూ.. తిరుమల శ్రీవారిని దర్శంచుకోవడానికి వీలుగా భక్తులను నియంత్రించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.

తిరుమల, తిరుపతి ప్రాంత వాసులను ఆలయంలోకి అనుమతించి భౌతిక దూరం పాటించడం...తొక్కిసలాట లేకుండా శ్రీవారి దర్శనం అమలు అంశాలను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. క్యూకాంప్లెక్స్‌లను మూసివేయనున్నారు. దర్శనం అనంతరం తిరుమల నుంచి కిందకు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోనున్నారు. భౌతిక దూరం పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవడానికి రోజుకు ఎంత మంది భక్తులకు వీలవుతుందన్న అంశంపై నిర్ధరణకు పలు అంశాలను పరిశీలిస్తున్నారు.

ఇప్పటివరకు ఆర్జిత సేవలు...ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు మాత్రమే ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లను విక్రయిస్తుండగా...కరోనా నేపథ్యంలో తిరుమల, తిరుపతిలో రద్దీ నియంత్రణకు సర్వదర్శనం టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో అందచేసేలా చర్యలు చేపడుతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్‌ పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి నేరుగా తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుని వెనుదిరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మరోవైపు అన్నదాన సత్రాల్లో అన్నప్రసాద వితరణపై సమాలోచనలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'లెక్కల కన్నా ఎక్కువ మందే చనిపోయి ఉంటారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.