ETV Bharat / state

బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చినశేషవాహన సేవ

author img

By

Published : Sep 28, 2022, 11:58 AM IST

BRAHMOTSAVALU : తిరుమలలో బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారు చినశేషవాహనం పై తిరుమల పురవీధుల్లో విహరించారు.

tirumala brahmothsavalu
బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చినశేషవాహన సేవ

TIRUMALA BRAHMOTSAVAM :అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు చినశేషవాహనంపై తిరుమల మాఢ వీధుల్లో స్వామి వారు విహరించారు. మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో భక్తులకు కనువిందు చేశారు. స్వామివారి వైభవాన్ని కనులారా చూసేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.

సాయంత్రం హంస వాహన సేవ : ఈరోజు సాయంత్రం 7గంటలకు స్వామివారు వీణాపాణియై.. సరస్వతీదేవి రూపంలో హంసతూలికా వాహనంపై విహరిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. అది పాలను, నీళ్లను వేరుచేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తిగలదని అర్థం. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని(శరణాగతి) కలిగిస్తాడు.

స్వామి వారిని దర్శించుకున్న సీఎం జగన్​: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జగన్‌కు.. తితిదే ఛైర్మన్, ఈవో.. శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం పరకామణి భవనాన్ని ప్రారంభించారు. రూ.23 కోట్లతో అత్యంత ఆధునికంగా పరకామణి భవనాన్ని తితిదే నిర్మించింది. తర్వాత పరకామణి భవన నిర్మాణ దాత కొట్టు మురళీకృష్ణను.. సీఎం సన్మానించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.