tipper stuck on the road in Himayat Nagar: హైదరాబాద్ నగరంలో మరోసారి రోడ్డు కుంగిపోయింది. గోషామహల్ చక్నవాడి ఘటన మరువక ముందే.. హిమాయత్ నగర్ వీధి నెంబర్ 5లో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అటుగా వెళ్తున్న మట్టి లోడ్ తో వెళ్తున్న టిప్పర్.. కుంగిన గుంతలో చిక్కుకుపోయింది. దీంతో డ్రైవర్‌తో, ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. కుంగిన రోడ్డు పక్కనే నాలా ప్రవహిస్తోంది.
స్థానిక భాజపా కార్పొరేటర్ మహాలక్ష్మీ.. అధికారులతో కలిసి టిప్పర్ తొలగించే చర్యలు చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని.. రెండేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కార్పొరేటర్ ఆరోపించారు. ప్రమాదాన్ని ముందే గుర్తించి నాలుగు రోజుల ముందు అధికారులను అప్రమత్తం చేసినా నిర్లక్ష్యం చూపారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోషామహల్ తప్పిన పెను ప్రమాదం: గత నెలలో గోషామహల్‌లోని స్థానిక మార్కెట్ వీధిలో కూడా రోడ్డు ఒక్కసారిగి కుంగిపోయింది. దీంతో అక్కడే నిల్చున్న కొందరు అందులో పడిపోవటంతో.. స్వల్ప గాయాలయ్యాయి. మార్కెట్లో విక్రయాలకు తెచ్చిన కూరగాయలు అందులో పడిపోయాయి. రోడ్డు కుంగిపోవటంతో భారీ గొయ్యి ఏర్పడటంతో పక్కనే ఉన్న వాహనాలు అందులో పడి.. దెబ్బతిన్నాయి. రోడ్డు కుంగే సమయంలో రద్దీ తక్కువగా ఉండటం.. వాహనాల రాకపోకలు లేకపోవటంతో పెను ప్రమాదమే తప్పింది.
ఇవీ చదవండి: