ఏపీలోని.. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక సంఘాల్లో షియర్‌వాల్ సాంకేతికతతో 300 చదరపు అడుగులతో నిర్మించిన 1,43,600 జీ+3 అపార్ట్‌మెంట్ ఇళ్లను.. ప్రభుత్వం ఒక్క రూపాయికే అందించనుంది.
365, 430 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లకు.. లబ్ధిదారుల వాటాలో 50 శాతం రాయితీని వర్తింపజేసింది. 365 చ.అ ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ ఇంటికి రూ.లక్ష తమ వాటాగా లబ్ధిదారులు చెల్లించాల్సి ఉండగా ఇందులో 50 శాతం రాయితీకి అనుమతిచ్చింది. ఇప్పటికే పూర్తిగా చెల్లించిన వారికి సగం మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు టిడ్కో కాలనీలుగా ఉన్న పథకం పేరును.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన- వైఎస్సార్ జగనన్న నగర్‌గా మార్పు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: మేధోసంపత్తి సూచీలో భారత్‌కు 40వ ర్యాంకు