గ్రేటర్లో టికెట్ల గొడవ మొదలైంది. నాచారం డివిజన్ టికెన్‌ను కాంగ్రెస్ నుంచి వచ్చిన సిట్టింగ్ కార్పొరేటర్‌కు ఇవ్వడంపై తెరాస అధ్యక్షుడు మేడల మల్లికార్జున్-జ్యోతిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి తమకు టికెట్ ఆశ చూపి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సిట్టింగ్‌కే టికెట్ ఇవ్వడంపై కన్నీరుమున్నీరయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మల్లికార్జున్-జ్యోతి దంపతులు స్పష్టం చేశారు. నాచారం డివిజన్లో తెరాస కార్యకర్తలు తమ పార్టీ బ్యానర్లను చింపివేశారు.
- ఇదీ చూడండి మన భాగ్యనగరం.. మినీ భారతం..