ETV Bharat / state

మృత్యు ఒడిలోకి చేరిన చిన్నారి దర్శిత్​.. - East Godavari district latest news

BOY DIED DUE TO ELECTRIC SHOCK : విద్యుదాఘాతంతో రెండు కాళ్లు కోల్పోయి.. 14 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం మృతి చెందాడు.

BOY DIED DUE TO ELECTRIC SHOCK
BOY DIED DUE TO ELECTRIC SHOCK
author img

By

Published : Nov 25, 2022, 7:39 PM IST

BOY DIED DUE TO ELECTRIC SHOCK : విద్యుదాఘాతంతో రెండు కాళ్లు కోల్పోయి.. 14 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శిత్‌ చివరికి మృత్యుఒడికి చేరాడు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టకు చెందిన జొన్నకూటి దర్శిత్‌(3) శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ నెల 12న తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టలో దర్శిత్‌ (3) ఇంటిపై ఆడుకుంటూ 33కేవీ విద్యుత్తు లైన్‌ కారణంగా విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు.

అదేరోజు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. బాలుడి రెండు కాళ్లకు తీవ్రగాయాలై ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో మోకాలి కింది వరకు తొలగించారు. అయినప్పటికీ ఇన్‌ఫెక్షన్‌ తగ్గకపోవడంతో కుడికాలులో మరికొంతభాగం (మోకాలుపై వరకు) నేడు శస్త్రచికిత్స చేసి తొలగించారు. తర్వాత వార్డుకు తరలించిన కొద్దిసేపటికే గుండె కొట్టుకుపోవడం నెమ్మదించి మృతిచెందాడని వైద్యులు తెలిపారు. 14రోజులు మృత్యువులో పోరాడి బాలుడు శుక్రవారం మృతి చెందడంతో పైడిమెట్ట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇవీ చదవండి: డిసెంబర్ 10,11 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్-2 ఉంటుందన్న హెచ్ఎండీఏ

శ్రద్ధ హత్య కేసులో మరో ట్విస్ట్.. త్వరలోనే గుడ్​ న్యూస్​ అని.. అంతలోనే హత్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.