ETV Bharat / state

సైబర్​ క్రైమ్​ పరిశోధనలో మూడు రోజుల పాటు శిక్షణ

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలను ఛేదించడంలో ప్రతి పోలీస్​ స్టేషన్​లోని అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని డీజీపీ మహేందర్​ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా 117 మంది పోలీసు అధికారులకు మూడు రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. సైబర్​ ఆధారిత నేర పరిశోధనకు ఈ ట్రైనింగ్​ దోహదపడుతుందని డీజీపీ అన్నారు.

cyber crime research
సైబర్​ క్రైమ్ శిక్షణ
author img

By

Published : Apr 15, 2021, 8:43 PM IST

సైబర్‌ ఆధారిత నేర పరిశోధనలో పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను ఛేదించడంలో ప్రతి పోలీసు స్టేషన్‌లోని అధికారులకు ప్రత్యేక శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. నేర పరిశోధన శాఖ, మహిళా భద్రతా విభాగం, రాష్ట్ర ఐటీ సెల్ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లలపై జరిగే నేరాల పరిశోధనపై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 117 మంది పోలీసులకు మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రారంభ సమావేశంలో డీజీపీ వెబినార్​ ద్వారా ప్రసంగించారు.

అవే కీలకం..

గతంలో ఇందులో శిక్షణ ఇచ్చిన అధికారులను సైబర్ వారియర్లుగా నియమించామని డీజీపీ తెలిపారు. మహిళలు, పిల్లలపై నేరాలు చేయడంలో నేరస్థులు అవలంబించిన పద్ధతులు, డిజిటల్ ఎవిడెన్స్​ నేర పరిశోధనలో కీలకమని అన్నారు. సైబర్ క్రైమ్ టూల్స్​లోనూ ప్రావీణ్యత సంపాదించడం ద్వారా విధినిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. అంతే కాకుండా షీ- టీమ్​లకు వచ్చే ఫిర్యాదులనూ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ వెబినార్ సమావేశంలో అడిషనల్‌ డీజీపీ స్వాతిలక్రా, ఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: నాగార్జునసాగర్​లో ముగిసిన ఎన్నికల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.