ఆదివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఓ మోస్తారుతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఇది ఉత్తర ఒరిస్సా, బెంగాల్ తీరాల నుంచి వాయువ్యం బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతోందని వివరించారు. దీనికి అనుబంధంగా 5.8 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది.
ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని వెల్లడించారు. ఆదిలాబాద్, నిర్మల్, కోమురం భీం–ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాల్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
ఇదీ చూడండి : ఆ విషయంలో సీఎంను ప్రశ్నించిన ఎంపీ రేవంత్ రెడ్డి