ETV Bharat / state

KTR BIRTHDAY: కేటీఆర్​ బర్త్​డే గిఫ్ట్​... ముక్కోటి వృక్షార్చన - telangana varthalu

మంత్రి కేటీఆర్​ పుట్టినరోజు సందర్భంగా వినూత్న కార్యక్రమానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దుతున్న సీఎం సంకల్పానికి మద్దతుగా ఆ రోజు మూడు కోట్ల మొక్కలు నాటే 'ముక్కోటి వృక్షార్చన' కార్యక్రమాన్ని చేపట్టాలని ఎంపీ సంతోశ్​ సంకల్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు కొనసాగింపుగా కేటీఆర్ పుట్టిన రోజు నాడు మూడు కోట్ల మొక్కలు నాటి బర్త్ డే గిఫ్ట్​గా ఇవ్వాలని నిర్ణయించారు.

KTR BIRTHDAY: కేటీఆర్​ బర్త్​డే గిఫ్ట్​... ముక్కోటి వృక్షార్చన

author img

By

Published : Jul 6, 2021, 7:25 PM IST

Updated : Jul 6, 2021, 7:33 PM IST

కేటీఆర్​ బర్త్​డే గిఫ్ట్​... ముక్కోటి వృక్షార్చన

దేశవ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపాలనే పట్టుదలతో చేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో సరికొత్త సవాల్​కు సిద్ధమైంది. ఈ నెల 24న తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల మొక్కలు నాటేలా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి ఎంపీ జోగినపల్లి సంతోశ్​ కుమార్ సంకల్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు కొనసాగింపుగా కేటీఆర్ పుట్టిన రోజు నాడు మూడు కోట్ల మొక్కలు నాటి బర్త్ డే గిఫ్ట్​గా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 24న ఉదయం పది గంటలకు ప్రారంభించి ఒక్క గంటలో మూడు కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటనున్నారు.

దీనికి సంబంధించిన బ్రోచర్​ను మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్​ రెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్​, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎంపీ కే కేశవ రావు, బాల్క సుమన్, గాదరి కిషోర్​కుమార్​, సైదిరెడ్డి చేతుల మీదుగా ఎంపీ సంతోశ్​ కుమార్ ఆవిష్కరించారు. తెరాస నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని... ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఎంపీ సంతోశ్​ కోరారు. వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ఎంపీ సంతోశ్​ను ఎంపీ కే.కేశవరావు అభినందించారు.

అప్పుడు కోటి వృక్షార్చన

గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా కోటివృక్షార్చన కార్యక్రమం ఉద్యమంలా నిర్వహించారు. తెరాస శ్రేణులు, ప్రజాప్రతినిధులు తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు చెబుతూ... ఎక్కడికక్కడ మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ జన్మదినం రోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా నిర్వహించిన కోటి వృక్షార్చన కార్యక్రమం రికార్డులకెక్కింది. గంట సమయంలో కోటి మొక్కలు నాటినందుకుగానూ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్​లో స్థానం లభించింది.

ఇదీ చదవండి: 'నేను రాజకీయాల్లోకి ఎప్పటికీ రాను... నా కల వేరే ఉంది'

Last Updated : Jul 6, 2021, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.