సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్లు, నకిలీ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ కేసులో ఇప్పటికే ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ రిమాండ్‌లో ఉన్నారు.
కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అనుచరులు ముగ్గురిని అరెస్టు చేశాం. కిడ్నాప్ సమయంలో వాహనాలకు నకిలీ నంబర్‌ప్లేట్లు బిగించారు. ప్రవీణ్ సోదరుల కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ-1 గా ఉన్నారు. నిందితులు మల్లికార్జున రెడ్డి, మాదాల శ్రీను పేరుతో సిమ్ కార్డులు తీసుకున్నారు. నిందితులు తీసుకున్న సిమ్ నంబర్లను అఖిలప్రియ ఉపయోగించారు. అఖిలప్రియ అనుచరుడు సంపత్‌కుమార్‌ను అరెస్టు చేశాం.
-- అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ
అఖిలప్రియ సూచన మేరకు నిందితులు.. ప్రవీణ్‌రావు ఇంటి వద్ద రెక్కీ చేశారని సీపీ వివరించారు. కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు.
కిడ్నాపర్లతో అఖిలప్రియ తరచూ మాట్లాడినట్లు ఆధారాలున్నాయి. కిడ్నాపర్ల వద్ద ఫోన్ నంబర్ నుంచి అఖిలప్రియకు కూడా కాల్స్ వెళ్లాయి. కిడ్నాప్ జరిగిన రోజు రాత్రి కిడ్నాపర్ల నుంచి డీసీపీకి కూడా ఫోన్ వచ్చింది. ప్రవీణ్ సోదరులు ముగ్గురిని వదిలేస్తున్నట్లు కిడ్నాపర్లు డీసీపీకి ఫోన్ చేశారు. పోలీసుల విషయంలో నిందితులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. అఖిలప్రియ ఆరోగ్యం బాగుందని వైద్యులు ధ్రువీకరించారు. అఖిలప్రియను 3 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. మూడ్రోజుల విచారణ అనంతరం మిగతా విషయాలను వెల్లడిస్తాం.
-- అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ
ఇదీ చూడండి: భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరణ