మిషన్- 2024 ఒలింపిక్స్‌లో భాగంగా కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ.. దేశ వ్యాప్తంగా జిల్లా స్థాయిలో వెయ్యి ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేయనుందని జాతీయ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అరిసనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. సొంతంగా అకాడమీ స్థాపన లేదా కేఐసీ సెంటర్లో కోచ్‌గా పని చేసేందుకు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.
ఆసక్తి గల వారు టీ స్పోర్ట్స్ హబ్ హెల్ప్ లైన్ నంబర్‌ను సంప్రదించాలని స్పష్టం చేశారు. అత్యధిక శాతం సెంటర్లను తెలంగాణలోనే ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేద్దామని జగన్మోహన్ రావు కోరారు. 2024 ఒలింపిక్స్ లో భారత్ తరఫున అత్యధిక పతకాలే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఇందు కోసం టీ స్పోర్ట్స్ హబ్ నుంచి అవసరమైన సహకారాన్ని అందిస్తామని జగన్మోహన్ రావు తెలిపారు.
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం