ETV Bharat / state

Balapur Ganesh Laddu: ఆసక్తి రేపుతోన్న బాలాపూర్​ లడ్డూ వేలం... ఈసారి పోటీ రెట్టింపు! - Telangana news

వినాయక లడ్డూ వేలం పాటలో 26 ఏళ్లుగా ప్రత్యేకతను సంతరించుకుంటోన్న బాలాపూర్ గణేశుడు ఈ ఏడాది భక్తుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. గతేడాది కరోనా కారణంగా లడ్డూ వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి... బాలాపూర్ లడ్డూను ముఖ్యమంత్రికి అందజేశారు. అంతకుముందు సంవత్సరం రికార్డు స్థాయిలోనే రూ.17 లక్షల 60 వేల రూపాయలకు స్థానికుడైన కొలను రాంరెడ్డి బాలపూర్ బంగారాన్ని దక్కించుకున్నారు. ఈసారి కూడా అదే స్థాయిలో లడ్డూ ధర పలకవచ్చని భావిస్తోన్న ఉత్సవ సమితి.... వేలంపాటకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.

Balapur Ganesh Laddu
బాలాపూర్​ లడ్డూ వేలం
author img

By

Published : Sep 18, 2021, 6:55 PM IST

భక్తుల పాలిట కొంగు బంగారమైన బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట (Balapur Ganesh Laddu Auction)కు ఉత్సవ సమితి సర్వం సిద్ధం చేస్తోంది. గతేడాది కరోనా కారణంగా విఘ్నాలు రావడంతో వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి... ఈ ఏడాది మరింత జోరుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. లడ్డూ వేలంపాటలో 26 ఏళ్లుగా ప్రత్యేకతను సంతరించుకున్న బాలాపూర్ గణేశుడు... తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ నలమూలల ఉన్న తెలుగువారిలో ఆసక్తిని రేకెత్తిస్తుంటాడు.

రూ.450 మొదలై...

1994లో 450 రూపాయలతో మొదలైన బాలాపూర్ గణేశుడి (Balapur Ganesh) లడ్డూ వేలం పాట... రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వందలు, వేలు దాటి రికార్డు స్థాయిలో లక్షల పలుకుతోంది. సుమారు 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలంపాట నువ్వానేనా అన్నట్లుగా జరుగుతుంటుంది. లడ్డూను దక్కించుకునేందుకు పడే పోటీ రసవత్తరంగా సాగుతుంటుంది. ఈ పోటీలో కొన్నిసార్లు స్థానిక రైతులు లడ్డూను దక్కించుకోగా మరికొన్నిసార్లు స్థానికేతరులు అదృష్టాన్ని పొందారు. 2016లో బాలాపూర్ లడ్డూను మేడ్చల్​కు చెందిన స్కైలాబ్ రెడ్డి 14 లక్షల 65 వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ.15 లక్షల 60 వేలకు లడ్డూ పొందగా... 2018లోనూ స్థానికేతరుడు తేరేటి శ్రీనివాస్ గుప్తా రూ.16 లక్షల 60 వేలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు.

కరోనా వల్ల...

వరుసగా మూడేళ్లు స్థానికేతరులనే బాలాపూర్ గణేశుడు కరుణించాడు. 2019లో జరిగిన వేలంపాటలో అవకాశం స్థానికులకు దక్కింది. కొలను రాంరెడ్డి రూ.17 లక్షల 60 వేలు పాడి బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. ఇలా... 26 ఏళ్లుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా సంప్రదాయంగా సాగిన లడ్డూ వేలంపాటకు 2020లో కరోనా మహామ్మారి అడ్డుపడింది. నిరాడంబరంగానే ఉత్సవాలను జరిపిన కమిటీ సభ్యులు... భక్తుల ఆరోగ్యం దృష్ట్యా వేలంపాటను రద్దు చేశారు. ఉత్సవ సమితి నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు లడ్డూను అందజేశారు.

చివరిపూజ తర్వాత వేలం...

పరిస్థితులు కుదుటపడటంతో ఈ ఏడాది లంబోదరుడి ఉత్సవాలను 10 రోజులపాటు ఘనంగా నిర్వహించిన ఉత్సవ సమితి... లడ్డూ వేలంపాటను కొనసాగించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు లడ్డూ వేలంపాటలో పాల్గొన్న 18 మంది శాశ్వత సభ్యులతోపాటు లడ్డూ దక్కించుకున్న స్థానికేతరులను ఆహ్వానించి సత్కరించింది. రేపు ఉదయం ఐదున్నర గంటలకు చివరి పూజ పూర్తైన అనంతరం బాలాపూర్ గణేశుడు గ్రామ ఊరేగింపునకు బయల్దేరుతాడు. ఆ తర్వాత ముఖ్యకూడలిలోని బొడ్రాయి వద్దకు బొజ్జ గణపయ్య చేరుకోగానే వేలాది మంది భక్తులు, పోటీదారుల సమక్షంలో ఉత్సవ సమితి లడ్డూ వేలంపాటను మొదలుపెట్టనుంది. సుమారు గంటపాటు సాగే ఈ వేలంపాట ఎంతో ఉత్కంఠగా సాగుతుంది.

గ్రామాభివృద్ధి కోసం మొదలుపెట్టి...

గ్రామాభివృద్ధి కోసం మొదలుపెట్టిన బాలాపూర్ లడ్డూ వేలం పాట... లంబోదరుడి కటాక్షంతో గతేడాది మినహా నిర్విఘ్నంగా కొనసాగుతూ బాలాపూర్ రూపురేఖలను మార్చింది. లడ్డూ దక్కించుకున్న వారి ఇంట సిరిసంపదలతోపాటు వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుండటంతో ఏటా ఇక్కడ తీవ్రమైన పోటీ నెలకొంటోంది. గతేడాది రూ.17 లక్షలు దాటిన బాలపూర్ గణేశుడి లడ్డూ... ఈసారి 20 లక్షల్లోపే పలకవచ్చని ఉత్సవ సమితి సభ్యులు అంచనా వేస్తున్నారు.

వేలంపాట తర్వాత...

లడ్డూ వేలంపాట పూర్తైన అనంతరం భక్తుల జయజయధ్వానాలు, కేరింతల మధ్య బాలాపూర్ గణేశుడి శోభయాత్ర వినాయక సాగరంవైపు కదలనుంది. ఫలక్​నుమా, చార్మినార్, అఫ్జల్​గంజ్, గౌలిగూడా చమాన్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్​బాగ్ మీదుగా ఎన్​టీఆర్ మార్గ్​కు చేరుకొని బాలాపూర్ గణేశుడి యాత్ర ముగియనుంది.

ఇవీ చూడండి: Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్​ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీం అంగీకారం

Cp Anjani Kumar: 'తొలిసారిగా పీవీ మార్గ్‌లో కూడా నిమజ్జనాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.