ETV Bharat / state

తొలిదశ ఎన్నికల నిర్వహణపై ఏపీఎస్​ఈసీ సంతృప్తి

ఆంధ్రప్రదేశ్​లో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆ రాష్ట్ర ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన దశల్లోనూ ఇదే ఒరవడి కొనసాగాలని అన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.

Nimmagadda Ramesh Kumar comments panchayat elections
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్​ఈసీ సంతృప్తి
author img

By

Published : Feb 9, 2021, 9:38 PM IST

ఆంధ్రప్రదేశ్​లో తొలి దశ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆ రాష్ట్ర ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఈసారి చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. మిగిలిన దశల్లోనూ ఇదే ఒరవడి కొనసాగాలని ఆకాంక్షించారు.

ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. తొలిదశ ఎన్నికల్లో 81.78 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వెల్లడించారు. ఏపీలోని కృష్ణా జిల్లాలో అత్యధికంగా 85.06 శాతం పోలింగ్‌ నమోదైందని.... ప్రజాస్వామ్య బలోపేతం దిశగా ఇది శుభారంభమని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.