ETV Bharat / state

Hightension in Thirumalagiri: తిరుమలగిరిలో హైటెన్షన్... కరెంటు స్తంభం ఎక్కిన స్థానికులు - సికింద్రాబాద్​ తాజా సమాచారం

Hightension in Thirumalagiri: సికింద్రాబాద్ తిరుమలగిరిలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. జేఎన్ఎన్​యూఆర్​ఎం ఇళ్లను అనర్హులకు కేటాయిస్తున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు. ఐదుగురు హైటెన్షన్ స్తంభం ఎక్కి నిరసన చేపట్టారు.

Hightension in Thirumalagiri
Hightension in Thirumalagiri
author img

By

Published : Dec 30, 2021, 12:11 PM IST

Hightension in Thirumalagiri: సికింద్రాబాద్​లోని తిరుమలగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద జేఎన్ఎన్​యూఆర్​ఎం ఇళ్లను రాజకీయనాయకులు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఐదుగురు హైటెన్షన్ స్తంభం ఎక్కి నిరసన చేపట్టారు. వెంటనే తమకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్​ చేశారు. లేదంటే కిందకు దూకి చనిపోతామని హెచ్చరించారు.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న అనుచరులు రూ.2 లక్షల చొప్పున ఇళ్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గుడిసెల్లో నివాసం ఉంటున్న తమకు ఇల్లు కేటాయిస్తామని చెప్పి... ఇప్పటి వరకు ఇవ్వలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వారిని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు.

ఎల్‌ఐసీ భవన్‌ వద్ద హెచ్‌టీ స్తంభాన్ని ఎక్కిన ఐదుగురు స్థానికులు

ఇదీ చదవండి: Wheel Chair Cricket Tourney : 'తగ్గేదేలే అంటున్న దివ్యాంగులు.. క్రికెట్​ పోటీల్లో ఇరగ్గొట్టారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.