ETV Bharat / state

అక్టోబర్ 7 నుంచి ఏకాంతంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ttd
ttd
author img

By

Published : Sep 17, 2021, 10:46 AM IST

Updated : Sep 17, 2021, 2:15 PM IST

10:45 September 17

అక్టోబర్ 7 నుంచి ఏకాంతంగానే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఈసారీ ఏకాంతంగానే జరగనున్నాయి. కరోనా మూడో దశ హెచ్చరికల దృష్ట్యా అక్టోబర్ 7 నుంచి 15 వరకు జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహిస్తామని.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. 

 బ్రహ్మాండనాయకుని.. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన వాహనసేవలన్నీ ఇక ఆలయ ప్రకారానికే పరిమితం కానున్నాయి. తిరుమాఢ వీధుల్లో  ఆ దేవదేవుడి వాహన సేవలు చూసి తరిద్దామనుకున్న.. భక్తులకు ఈసారీ నిరాశే మిగలనుంది.

కొవిడ్​ థర్డ్​వేవ్​ వస్తుందనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా.... నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికల దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉంటూ... సర్వదర్శనం టిక్కెట్లు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తాం. కొవిడ్​ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని రాబోయే స్వామివారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని నిర్ణయించాము. -వై.వి.సుబ్బారెడ్డి, తితిదే ఛైర్మన్.

ఇదీ చూడండి: TTD Incense Sticks: తితిదే బ్రాండ్​తో అగరబత్తీలు.. ఆ పూలతోనే తయారీ.!

Last Updated : Sep 17, 2021, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.