ఇప్పటికే అనంతపురం జిల్లా నుంచి రెండు కిసాన్ రైళ్లను నడిపిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మూడోసారి సరకులను రవాణా చేశారు. ఈ కిసాన్ రైలు ద్వారా 242.8 టన్నుల సరకులను దేశ రాజధాని దిల్లీకి పంపించారు. మొట్టమొదటి కిసాన్ రైలు దిల్లీలోని ఆదర్శనగర్కు నడిపినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ వెల్లడించారు.
రైతులకు రవాణా ఛార్జీల్లో 50 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రైతుల కోసం ప్రత్యేకంగా ఆహార తయారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 'ఆపరేషన్స్ గ్రీన్స్- టాప్ టు టోటల్' పేరిట పండ్లు, కూరగాయలను రవాణా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశం రైతులకు ఎంతో ఉపయోగపడనుంది.