గోల్కొండ బోనాల సంబురాలు మూడో వారం కోలాహలంగా సాగుతున్నాయి. గురువారం తొలి బోనం అందుకున్న జగదాంబ మహంకాళి అమ్మవారికి భక్తులు మూడో బోనాన్ని ఘనంగా సమర్పించారు. వేకువ జాము నుంచే పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం ఎత్తి అమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోటపైనే వంటలు వండుకుని ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగుకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
- ఇవీ చూడండి: ఘనంగా గోల్కొండ అమ్మవారి బోనాలు
- ఇవీ చూడండి: గోల్కొండ కోటలో రెండవ వారం అమ్మవారి బోనాలు