ETV Bharat / state

మహిళా సాధికారత కల సాకారమవ్వాలంటే.. వీటిని సాధించాలి!

Every Women Should achieve this: పాఠాలు వినడం నోచుకోని స్థితి నుంచి వాటిని బోధించే వరకు.. కిచెన్​లో వంటలు మాత్రమే చేసే స్థితి నుంచి కంప్యూటర్​తో అద్భుతాలు సృష్టించే వరకు.. ఓటు వేయలేని స్థితి నుంచి.. దేశాన్ని పరిపాలించే స్థాయి వరకు.. ఆటో నడపటం నుంచి అంతరిక్షం వెళ్లే వరకు... ఇలా మహిళలు ఎన్నో సాధించారు. అయినప్పటికీ వాళ్లు సాధించాల్సినవి ఇంకా ఉన్నాయి.

Happy Women's Day 2023
Womens Rights
author img

By

Published : Mar 8, 2023, 4:31 PM IST

Every Women Should achieve this: కాలం మారుతున్న కొద్ది, టెక్నాలజీ పెరుగుతున్న కొలదీ మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారు. ఒకప్పుడు వంట గదికి మాత్రమే పరిమితమైన వారు.. ఇప్పుడు అన్నింటిలో ముందుంటున్నారు. ముఖ్యంగా అధునాతన సాంకేతిక అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకెళ్తున్నారు.

ప్రస్తుతం 21 వ శతాబ్దంలో ఉన్నా.. మహిళలు ఇంకా కొన్ని విషయాల్లో వెనకబడ్డారు. నేటికీ వారికి అందులో అనుకున్నంత ఫలితం లేదు. వాటికోసం ఇంకా ప్రయాస పడాల్సిన అవసరం ఉంది. సాధించాల్సిన అవసరముంది.

1. చదువు (Education) : గతంతో పోలిస్తే.. ఇప్పుడు చాలా మంది మహిళలు చదువుకుంటున్నారు. స్కూల్, కాలేజీలకు మాత్రమే పరిమితం కాకుండా.. యునివర్సిటీ స్థాయిలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. వాటికోసం విదేశాలకు వెళ్లేందుకూ సిద్ధపడుతున్నారు. అయితే ఇంకా దీని ఆవశ్యకత పెరగాల్సిన అవసరముంది. పట్టణ, నగరాల స్థాయి వరకు ఓకే కానీ.. ఇంకా కొన్ని గ్రామాల బాలికలు చదువులకు దూరంగా ఉంటున్నారు. ప్రతి మహిళా చదువుకున్నప్పుడే సమాజంలో జరుగుతున్న అంశాలపై అవగాహన కలిగి ఉండి.. అందుకు అనుగుణంగా వ్యవహరించవచ్చు.

2. స్వేచ్ఛ (Freedom) : ఈ భూగోళం మీద ఉన్న ప్ర‌తి జీవికి స్వేచ్ఛ‌గా బ‌తికే హ‌క్కు ఉంది. అయితే.. అనాదిగా మ‌హిళ‌లు సంస్కృతి, సంప్ర‌దాయం, ఆచారాల పేరిట అనేక వివ‌క్ష ఎదుర్కొన్నారు. ఫ‌లితంగా వారి స్వేచ్ఛ‌ను కోల్పోయారు. ప్ర‌స్తుతం ఇందులో కొంత మార్పు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. రావాల్సింది ఇంకా ఉంది. కొంద‌రికి నేటికీ స‌రైన ఫ్రీడ‌మ్ లేదు అని నిరూపించే ఘ‌ట‌న‌లు అక్క‌డ‌క్క‌డా వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల కింద‌ట విజ‌య‌నగ‌రం జిల్లాకు చెందిన ఓ మ‌హిళ‌ను త‌న భ‌ర్త బ‌య‌టికి రాకుండా సుమారు 13 ఏళ్లు గృహ నిర్బంధం చేశాడు. బ‌య‌ట స‌మాజంలో కూడా అత్యాచారాలు లాంటి ఘ‌ట‌న‌లు ఎక్కువే జ‌రుగుతున్నాయి. కాబట్టి మ‌హిళ‌లు సాధించాల్సిన దాంట్లో స్వేచ్ఛ కూడా ఉంది.

3. ఆర్థిక స్వాతంత్య్రం (Financial Liberty) : పితృ స్వామిక స‌మాజంలో పురుషులే ఆర్థిక సంబంధ‌మైన విష‌యాలు చూసుకుంటారు. మ‌న దేశంలోనూ ఇలాంటి విషయాల్లో స్త్రీల పాత్ర చాలా త‌క్కువ‌. ఇప్పుడిప్పుడే మ‌గువ‌లు బ‌య‌టికొచ్చి సంపాదిస్తున్నారు. ఐటీ, వ్య‌వ‌సాయం, అంకుర సంస్థ‌లు, వ్యాపారం ఇలా అనేక రంగాల్లో రాణిస్తున్నప్ప‌టికీ.. కొంద‌రు మ‌హిళల‌కు ఆర్థిక స్వాతంత్య్రం ఉండ‌దు. డ‌బ్బుల కోసం పురుషుల‌పై ఆధార‌ప‌డాల్సిందే. ఇటు ఇల్లు చ‌క్క‌బెట్టుకుంటూ అటు ఉద్యోగం చేసినా స‌రే... పెత్తనం అంతా పురుషుల‌దే ఉంటుంది. ఆర్థిక స్వాతంత్య్రం ఉన్న‌ప్పుడే వారు ఆత్మ విశ్వాసంతో బ‌తుకుతారు. ఏమైనా చేయ‌గ‌లం అన్న న‌మ్మ‌కం ఏర్ప‌డుతుంది.

4. హ‌క్కుల‌పై అవ‌గాహ‌న (Having Knowledge of Law and their Rights) : చాలా మంది స్త్రీల‌కు చ‌ట్టాల ప‌ట్ల, వారి హ‌క్కుల పైన అవ‌గాహ‌న లేదు. ప్ర‌త్యేకంగా వారికోస‌మే ఉన్న వాటి గురించి సైతం తెలియదు. ఇందులో నిర‌క్ష‌రాస్యులే కాదు... చ‌దువుకున్న వారిదీ ఇదే ప‌రిస్థితి. కాబ‌ట్టి ప్ర‌తి స్త్రీ త‌న‌కున్న హ‌క్కులు, గృహ హింస‌, నిర్భ‌య‌, దిశ లాంటి చ‌ట్టాల గురించి త‌ప్ప‌కుండా అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి. వీటితో పాటు.. భార‌తీయ శిక్షా స్మృతిలో వారి కోస‌మే ఉన్న సెక్ష‌న్ల గురించి తెలుసుకోవాలి. దీని వల్ల మీరు ఏవైనా ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొన్న‌ప్పుడు మిమ్మ‌ల్ని మీరు కాపాడుకోవ‌చ్చు.

5. రాజ‌కీయ భాగ‌స్వామ్యం (Political Participation) : ఇప్ప‌టికే చాలా రంగాల్లో స్త్రీలు దూసుకెళుతున్నారు. ఐఏస్‌, ఐపీఎస్ వంటి ఉన్న‌త స్థాయి ఉద్యోగాలూ చేస్తున్నారు. కానీ.. మ‌హిళ‌లు అభివృద్ధి చెందాలంటే.. రాజ‌కీయం రంగంలోనూ వారి భాగ‌స్వామ్యం అవ‌స‌రం. మ‌న దేశంలో రాజకీయాల్లో ఉన్న స్త్రీల సంఖ్య చాలా త‌క్కువ‌. వారి హ‌క్కులు సాధించడంలో అధికార‌మూ ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. ఇండియాలో ఎన్నిక‌ల్లో పాల్గొనే మ‌హిళ‌ల శాతం దాదాపు 15 మాత్ర‌మే.

వీటన్నిటికి తోడు.. ప్రతి మ‌హిళా.. త‌మ జీవితంలో క‌ష్టాలు, ఇబ్బందులు వ‌చ్చిన‌ప్పుడు.. మీ తోడు ఎవరున్నా లేకున్నా.. మీకు సాయం చేసినా చేయ‌కున్నా.. మీ కాళ్ల‌పై మీరు నిల‌బ‌డ‌గ‌లిగే సామ‌ర్థ్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని సంపాదించుకోండి. స‌మాజంలో కొంద‌రు దాడి చేసే విమ‌ర్శ‌ల‌ను.. మీ చేత‌ల‌తో తిప్పి కొట్టే స్థితిలో నిల‌బడండి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.