రైళ్లు, బస్సుల్లో ప్రయాణికుల వద్ద చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రవేటు ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని చోరీ చేస్తున్న ఇద్దరినీ పక్కా సమాచారంతో పట్టుకున్నారు.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులో సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి వద్ద దొంగతనం జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోని దిగిన పోలీసులు... అన్ని ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.92 లక్షల నగదు, 2 చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే ప్రమాణం