ఏటీఎంల్లో నింపాల్సిన నగదును ఎత్తుకెళ్లిన ప్రకాశ్ అనే వ్యక్తిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 90 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశ్ పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు వాసిగా గుర్తించారు.
ఏం జరిగిందంటే...
నిందితుడు సీఎంఎస్ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో అక్రమంగా డబ్బు సంపాదించాలని ప్రకాశ్ కుట్ర పన్నాడు. ఈనెల 16న ఎస్బీఐ ఏటీఎంలో నగదు నింపేందుకు వెళ్లిన వాహనం వెళ్లింది. ఏటీఎంలో 60 లక్షలు నింపేందుకు లోపలికి వెళ్లిన ఇద్దరు సిబ్బంది.. 90 లక్షలు తీసుకుని వాహనంతోపాటు ప్రకాశ్ ఉడాయించాడు. కొద్దిదూరం వెళ్లాక వాహనం వదిలేసి డబ్బుతో పారిపోయాడు. నిందితుడిని హైదరాబాద్ సీపీ అంజనికుమార్ మీడియా ఎదుట హాజరు పరిచారు.
ఇదీ చూడండి: పది పరీక్షలు ప్రారంభం.. విద్యార్థులంతా మాస్క్‌లతో హాజరు