పగలు రెక్కీ... రాత్రి చోరీలు
వేముల నవీన్, నిఖిల్‌లు స్నేహితులు... వీరు 2017లో చోరీలు చేసి జైలు జీవితం గడిపారు. అయినప్పటికీ వారిలో మార్పు రాలేదు. సులభంగా వచ్చే డబ్బులకు అలవాటు పడ్డారు. వీరికి స్థానికంగా ఉండే జ్యోతితో పరిచయం ఏర్పడింది. ముగ్గురు కలిసి ఉదయం సమయంలో బైక్‌పై తిరుగుతూ రెక్కీ నిర్వహించేవారు. రాత్రి సమయంలో ఇంటికి తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడేవారు.
పదివేలు వస్తే యాదగిరిగుట్ట, 50వేలు వస్తే గోవాకు వెళ్లి జల్సాలు చేసేవారు. వీరు ముగ్గురు మేడిపల్లి పీఎస్ పరిధిలో రెండు ఇళ్లు, ఉప్పల్‌లో ఒక ఇంట్లో చోరీ చేశారు. పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించారు. అదుపులోకి తీసుకొని విచారించగా విషయం వెలుగులోకొచ్చింది. నిందితుల నుంచి 9 తులాల బంగారం, 2 ఐ ఫోన్లు, 2 ఫాస్ట్ ట్రాక్ గడియారాలు, ఎల్సీడీ టీవిని స్వాధీనం చేసుకుని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు.