ETV Bharat / state

Weather Report: రానున్న మూడు రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు - తెలంగాణలో వర్షాలు

రాగల మూడ్రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rain in telangana) కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి రాష్ట్రం మీదుగా బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.

telangana news
weather report
author img

By

Published : May 30, 2021, 3:59 PM IST

జూన్​ 3 నాటికి నైరుతి రుతు పవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు ఉపరితల ద్రోణి తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ వరకు సముద్రమట్టానికి 1.5కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడిందని.. ఉపరితల ఆవర్తనం తమిళనాడు పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిమీ వరకు వ్యాపించి ఉందని ఐఎండీ సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.

దీని ప్రభావంతో రాగల మూడ్రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (telangana rains) కురిసే అవకాశముందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

ఇదీ చూడండి: రాష్ట్ర కేబినెట్​ భేటీ.. లాక్‌డౌన్‌తో పాటు కీలక అంశాలపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.