రైల్లో ప్రయాణిస్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న శేష రావు అనే వ్యక్తిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రైళ్లలో చంటి పిల్లల తల్లులే లక్ష్యంగా వారి చేతి బ్యాగులను దొంగిలిస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 5 లక్షల రూపాయల విలువైన 8 తులాల బంగారు ఆభరణాలు, నాలుగు సెల్ ఫోన్లు, రెండు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒకే రైల్లో ప్రయాణిస్తున్న మహిళల దృష్టి మరల్చి, శౌచాలయం వెళ్ళిన సమయంలో వారి బ్యాగు నుంచి విలువైన వస్తువులను దొంగిలించాడని రైల్వే డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
విశాఖ ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్లో శేష రావు దొంగతనాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. హ్యాండ్ బ్యాగులను రైల్వే టీసీకి గాని, సిబ్బందికి గాని అప్పగిస్తే..వారు భద్రపరిచే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రైల్వే డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : ‘యాదాద్రి స్తంభాలపై కేసీఆర్ బొమ్మలా?’