ETV Bharat / state

వైన్​షాపులో చోరీ... రూ.18 లక్షలు మాయం - crime

వైన్​షాప్​ గోడకు రంధ్రం చేసి లాకర్​లో ఉన్న 18 లక్షల నగదును ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటన హైదరాబాద్​ నారాయణగూడ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. షాప్​ నిర్వాహకుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అర్ధరాత్రి వైన్​షాపులో చోరీ
author img

By

Published : Nov 11, 2019, 11:12 PM IST

ఓ వైన్ షాప్ వెనుక గోడకు రంధ్రం చేసి లోపలికి చొరబడి లాకర్​లో ఉన్న రూ.18 లక్షల నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన హైదరాబాద్ నారాయణగూడ పీఎస్​ పరిధిలో జరిగింది. బంజారాహిల్స్​లో నివాసం ఉండే మాన్మీత్ సింగ్ హిమాయత్ నగర్​లోని ఓ భవనంలో షటర్ అద్దెకు తీసుకుని కుల్​దీప్ వైన్స్ ఏర్పాటు చేశాడు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో వైన్​షాపులో పనిచేసే సిబ్బంది తాళం వేసి వెళ్లి పోయారు. మూడు రోజులుగా మద్యం విక్రయించగా వచ్చిన డబ్బు రూ.18 లక్షల నగదును లాకర్​లో భద్రపరిచారు .

దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసి లోపలికి వెళ్లి లాకర్​ను పగులగొట్టి అందులో దాచిన నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం వైన్​షాప్​లో పనిచేసే సిబ్బంది వచ్చి దుకాణం తెరిచారు. గోడకు రంధ్రం ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కుల్​దీప్ వైన్స్ నిర్వాహకుడు మాన్మీత్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ భవనంలో పని చేసే నేపాల్ దేశానికి చెందిన వాచ్​మెన్ కనిపించకుండా పోవడం వల్ల అతడే చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అర్ధరాత్రి వైన్​షాపులో చోరీ

ఇవీ చూడండి: చోరీలకు పాల్పడుతున్న యువకుడి అరెస్టు

TG_Hyd_67_11_Chory At Wine's Chory_Av_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) ఓ వైన్ షాప్ వెనుక గోడకు రంధ్రం చేసి లోపలికి చొరబడి లాకర్ లో ఉన్న రూ . 18లక్షల నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్ళి పోయిన సంఘటనహైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బంజారాహిల్స్ నివాసం ఉండే మాన్ మీత్ సింగ్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెం 5 వద్ద ఓ భవనంలో షటర్ అద్దెకు తీసుకుని కుల్ దీప్ వైన్స్ ఏర్పాటు చేశాడు . ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో వైన్స్ షాపులో పనిచేసే సిబ్బంది తాళం వేసి వెళ్లి పోయారు. మూడు రోజులుగా మద్యం విక్రయించగా వచ్చిన డబ్బు 18 లక్షల నగదును లాకర్ లో భద్రపరిచారు . దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసి లోపలికి వెళ్లి లాకర్ ను పగుల గొట్టి అందులో దాచిన నగదును దుండగులు ఎత్తుకొని పరారయ్యారు . సోమవారం ఉదయం వైన్స్ షాప్ లో పనిచేసే సిబ్బంది వచ్చి దుకాణం తెరిచే సరికి గోడకు రంధ్రం ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కుల్ దీప్ వైన్స్ నిర్వహకుడు మాన్ మీత్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు . అయితే ఆ భవనంలో పని చేసే నేపాల్ దేశానికి చెందిన వాచ్ మెన్ కనిపించకుండా పోవడంతో ఆ అతడే చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విజువల్స్....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.