ETV Bharat / state

గ్రేటర్‌లో థీమ్​ పార్కులు వస్తున్నాయ్​!

గ్రేటర్​ పార్కుల్లో వినోదం, విహారంతో పాటు విజ్ఞానాన్ని అందించేందుకు జీహెచ్​ఎంసీ కసరత్తు చేస్తోంది. నగర ఇతివృత్తాన్ని ప్రదర్శించే విధంగా 47థీమ్​ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

author img

By

Published : Aug 3, 2019, 2:13 PM IST

గ్రేటర్‌లో థీమ్​ పార్కులు వస్తున్నాయ్​!

గ్రేటర్​ పరిధిలో స్వచ్ఛ హైదరాబాద్​తో పాటు దాదాపు 15కు పైగా పలు థీమ్​లను ప్రతిబింబించే 47 అర్బన్​ లీవింగ్​ థీమ్​ పార్కులను 120కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నట్లు మేయర్​ బొంతు రామ్మోహన్​ తెలిపారు. నగరంలో థీమ్​ పార్కుల నిర్మాణంపై జీహెచ్ఎంసీ కమిషనర్​ దానకిశోర్​, పలువురు ఉన్నతాధికారులు, థీమ్​ పార్కుల డిజైనింగ్​ కన్సల్టెంట్​లతో మేయర్​ బొంతు రామ్మోహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

గ్రేటర్‌లో థీమ్​ పార్కులు వస్తున్నాయ్​!

ఇతివృత్తాన్ని తెలిపే పార్క్​లు

హైదరాబాద్​ ఇందిరాపార్కు, వెంగళరావు పార్కు, కృష్ణకాంత్​ పార్కు, నెహ్రూ పార్కుల అనంతరం నగరంలో మేజర్​ పార్కుల నిర్మాణం జరగలేదని మేయర్​ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత నాణ్యమైన జీవన వాతావరణాన్ని కల్పించేందుకు నగరంలో ఒక ఎకరానికి పైగా ఖాళీ స్థలాలను గుర్తించి వాటిలో ప్రత్యేకంగా థీమ్​ పార్కులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. థీమ్​ పార్కుల్లో స్వచ్ఛ హైదరాబాద్​ ఇతివృత్తాన్ని తెలిపే 12 పార్కులను జోన్​కు రెండు చొప్పున ఏర్పాటు చేస్తామని తెలిపారు.

పిల్లల కోసం ప్రత్యేక పార్కులు:

ఈ స్వచ్ఛ థీమ్​ పార్కుల్లో తడి, పొడి చెత్త సేకరణ, సేంద్రియ ఎరువుల తయారీ, ఇంకుడు గుంతల నిర్మాణం, ట్రాన్స్​ఫర్​ స్టేషన్ల నిర్వహణ, ప్లాస్టిక్​ రీసైక్లింగ్​, డంప్​యార్డ్​ల క్యాపింగ్​ పనులు, సాఫ్​, షాన్​దార్​ హైదరాబాద్​లలో చేపట్టిన పలు కార్యక్రమాలను తెలుసుకునే విధంగా పార్కుల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు రామ్మోహన్​ తెలిపారు. అంతే కాకుండా యూనివర్సల్​ థీమ్​ పార్కు, తెలంగాణ సంస్కృతి, సైన్స్​ పార్కు, రెయిన్​ ఫారెస్టు థీమ్​ పార్క్​, అడ్వంచర్​ పార్క్​ తదితర వినూత్న అంశాలతో కూడిన పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గ్రేటర్​ పరిధిలో ఇప్పటివరకు బాలలకు ప్రత్యేకంగా ఉద్యానవనం లేదని... 47 పార్కుల్లో చిల్డ్రన్స్​ థీమ్​ పార్కుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నమని పేర్కొన్నారు.

పార్కులో ఆడియో, విజువల్​ చిత్రాల ప్రదర్శన

పార్కుల నిర్మాణ అంచనా వ్యయాలను వెంటనే రూపొందించి జీహెచ్​ఎంసీ జనరల్​బాడీలో ఆమోదం పొందేలా ప్రతిపాదనలను సమర్పించాలని సంబంధిత అధికారులను కమిషనర్​ దానకిశోర్​ ఆదేశించారు. ప్రతి పార్కులో న‌గ‌ర స్వచ్ఛత, చ‌రిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే ఆడియో, విజువ‌ల్ చిత్రాల‌ను కూడా ప్రద‌ర్శించాల‌ని తెలిపారు.

ఇదీ చూడండి: వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.