నటుడు సోనూసూద్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలపై అభిమానులు ప్రేమను చాటుకుంటున్నారు. కరోనా సమయంలో పేదలకు సేవలందించిన సోనూకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున అభిమానులున్నారు. అంతే కాకుండా ఆయన సేవలను వివిధ రూపాల్లో అభినందిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్లోని రామంతాపూర్కు చెందిన ఓ యువ చిత్రకారుడు స్వయంగా సోనూ చిత్రాన్ని గీసి కానుకగా బహుకరించాడు. ప్రశాంత్ కుమార్ అనే చిత్రకారుడు సోనూసూద్ చిత్రపటాన్ని వేసి... ముంబైలోని నివాసానికి వెళ్లి అందజేశారు. ఆ చిత్రపటాన్ని చూసిన సోనూ తనను అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని చిత్రకారుడు ప్రశాంత్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ వస్తే తప్పకుండా కలుస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
ఇదీ చూడండి: Sonusood: 'మీ వెంటే నేను'.. అమరావతి రైతులతో సోనూసూద్