సికింద్రాబాద్ వారసిగూడకు చెందిన రుక్సానా బేగం ఉదయం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొన్ని రోజులుగా ఇంట్లో ఎవరూ పనికి వెళ్లకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మనస్థాపానికి గురైవ బేగం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఏం చేయాలో తెలియని స్థితిలో...
కుటుంబ పోషణ భారం కావడం వల్ల ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా లేక గొడవలేవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రుక్సానా బేగం మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.