తల్లికి లేదా నవజాత శిశువుకు కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై.. నేషనల్ నియోనాటల్ ఫోరమ్ తెలంగాణ శాఖ వెబినార్ నిర్వహించింది. నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫోరమ్ అధ్యక్షుడు డా.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డా.రమేశ్‌లతో పాటు.. పలువురు చిన్నపిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారు. శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బ్రౌచర్‌ను విడుదల చేశారు.



కరోనా సమయంలో నవజాత శిశువులకు సంబంధించి వైద్యులు ఎదుర్కొనే సవాళ్లు, ప్రతి సవాళ్లపై ఈ సదస్సులో చర్చించారు. తల్లికి కరోనా సోకిన సమయంలో.. శిశువును చూసుకునే విధానాన్ని వైద్యులు వివరించారు.
ఇదీ చదవండి: కరోనా లేని గ్రామం ఎక్కడుందో తెలుసా..?