నిర్మాణంలో ఉన్న గోడ కూలి వ్యక్తి మృతి చెందిన ఘటన ఖైరతాబాద్‌లో జరిగింది. బీఎస్ఎన్ఎల్ అధికారుల వసతి గృహాల సముదాయంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలింది. మూడు నెలల కిందట పడిపోయిన గోడను పునర్నిర్మిస్తుండగా కూలిపోయింది. ప్రమాదంలో కూలీగా పనిచేస్తున్న గద్వాల జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.
క్షతగాత్రుడిని హుటాహుటిన మసబ్‌ట్యాంక్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
ఇదీ చూడండి: తన పొలం కంచె.. తనకే యమపాశం