రోజు రోజుకు పెరిగిపోతున్న లవ్ జిహాదీ కేసులను అరికట్టాలని... భైంసాలో అల్లర్లకు పాలుపడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టర్కు భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నాయకుల బృందం వినతిపత్రం సమర్పించారు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, అసోం రాష్ట్రాలలో ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి... అల్లర్లకు, లవ్ జిహాదీ పేరుతో హింసించే వారిపై కఠినంగా శిక్షిస్తున్నారని.. అలాగే మన రాష్ట్రంలో కూడా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మహిళల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. లవ్ జిహాదీ కేసులపై, భైంసాలో హిందువుల దుకాణాలతో పాటు.. నలుగురిపై కిరాతకంగా దాడి చేసినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాక పోతే ప్రజల్లోకి వెళ్లి ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
ఇదీ చదవండి: దేశంలోనే అధిక వేతనాలు ఇస్తున్న ఘనత మనదే: శ్రీనివాస్ గౌడ్