కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో నగరంలోని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు చిలకలగూడ కూడలి వద్ద వాహనదారులు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు.
ఇప్పటికీ చాలామంది ప్రయాణికులు మాస్క్ లేకుండానే ప్రయాణిస్తున్నారని తెలిపారు. కోవిడ్ నిబంధనలను అనుసరించని పక్షంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: బరువు తగ్గాలంటే ఈ పద్ధతులే బెస్ట్!