దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసు తుది నివేదిక సమర్పణకు దర్యాప్తు కమిషన్‌కు సుప్రీంకోర్టు ఆరు నెలల గడువు ఇచ్చింది. ఎన్కౌంటర్ ఘటనపై న్యాయవాది జీఎస్ మణి వేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు.. జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో దర్యాప్తు కమిషన్‌ను నియమించింది. గతేడాది జూన్‌లోనే కమిషన్ నివేదిక సమర్పించాల్సి ఉండగా.. కొవిడ్ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఆరు నెలల గడువు పొడిగించింది.
తాజాగా జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ మరో ఆరు నెలల గడువు కోరుతూ అప్లికేషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి.. 6 నెలల గడువు ఇచ్చేందుకు అంగీకరించింది.
ఇదీ చదవండి: పన్నెండు రోజుల్లో పెళ్లి.. తండ్రీ కొడుకులే మిగిలారు.!