గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడాది బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. టోలిచౌకి వద్ద జరీనా షేక్ అనే మహిళ బిక్షాటన చేస్తూ ముగ్గురు పిల్లలతో జీవనోపాధి పొందుతోంది. ఈ నెల తొమ్నిదో తేదిన ఆమె సంవత్సరం కొడుకు కిడ్నాప్‌నకు గురయ్యాడు. బాధితురాలు నిద్రిస్తున్న సమయంలో మరో యాచకురాలు ఈ ఉదంతానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అదుపులోకి..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితురాలు తబస్సుమ్ బేగం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బాలుడిని అమ్మేందుకు యత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని తల్లికి అప్పగించిన పోలీసులు నిందితురాలిని కోర్టుకు తరలించారు.
ఇదీ చదవండి:ముగిసిన అఖిలప్రియ కస్టడీ.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు