ETV Bharat / state

జీఎస్టీ విషయంలో ఇవాళ ఒక నిర్ణయానికి రానున్న రాష్ట్రం - అసలు కేంద్రం, వడ్డీ రాష్ట్రాలే కట్టుకోవాలి ప్రతిపాదన

జీఎస్టీ పరిహారం చెల్లింపునకు సంబంధించి జీఎస్టీ మండలి రాష్ట్రాల ముందుంచిన రెండు ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆధ్వర్యంలో జరిగే ఉన్నతస్థాయి సమీక్షలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

the-state-is-coming-to-a-decision-today-on-the-gst-issue
జీఎస్టీ విషయంలో ఇవాళ ఒక నిర్ణయానికి రానున్న రాష్ట్రం
author img

By

Published : Aug 31, 2020, 4:50 AM IST

జీఎస్టీ విషయంలో ఇవాళ ఒక నిర్ణయానికి రానున్న రాష్ట్రం

ఒకే దేశం, ఒకే పన్ను నినాదంతో 2017 జులై నుంచి వస్తు సేవల పన్నును కేంద్రం అమలులోకి వచ్చింది. పెట్రోల్‌, మద్యం మినహా దాదాపు అన్నింటిని జీఎస్టీ పరిధిలోకి కేంద్రం తెచ్చింది. జీఎస్టీ తీసుకురావడం వల్ల భారీగా నష్టం వచ్చే అవకాశాలున్నాయన్న రాష్ట్రాలు ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని... అయిదేళ్లపాటు రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. ప్రతి ఏడాది అంతకు ముందు ఏడాది వచ్చిన జీఎస్టీ రాబడుల మొత్తంతో బేరీజు వేసి దాని కంటే 14 శాతం అదనంగా చేర్చి ఒక బెంచి మార్కు నిర్ణయించి.. ఆ మొత్తం కంటే తక్కువ ఆదాయం వచ్చినట్లయితే ఆ లోటును జీఎస్టీ పరిహారం పేరుతో కేంద్రం రాష్ట్రాలకు చెల్లిస్తూ వస్తోంది.

రావాల్సిన పరిహారం

కరోనా ప్రభావం జీఎస్టీ రాబడులపై పడగా ఆదాయం చాలా వరకు తగ్గిపోయింది. రాష్ట్రాలు తమకు రావాల్సిన పరిహారం అంశంలో కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో కేంద్ర సర్కారు రెండు ప్రతిపాదనలను రాష్ట్రాల ముందుంచింది. మొదటి ప్రతిపాదనలో జీఎస్టీ అమలు వల్ల వచ్చే నష్టాన్ని 97 వేల కోట్లుగా అంచనా వేయగా... ఈ మొత్తాన్ని కేంద్రం ఆర్​బీఐ నుంచి రుణం ద్వారా రాష్ట్రాలకు పరిహారంగా ఇప్పిస్తుంది. అసలు, వడ్డీ కేంద్రమే చెల్లిస్తుంది. రెండో ప్రతిపాదనలో కొవిడ్‌, జీఎస్టీ అమలు వల్ల నష్టపోయిన 2 లక్షల 37 వేల కోట్లు రుణాల ద్వారా సమకూర్చుతుంది. అసలు మాత్రమే కేంద్రం చెల్లిస్తుంది. వడ్డీ రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది.

రాష్ట్రం భారీగా

మొదటి ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే పరిహారం తక్కువగా వస్తుంది. ఇప్పటికే కరోనా ప్రభావంతో రాష్ట్రం భారీగా నష్టపోయింది. భవిష్యత్తులో ఈ నష్ట ప్రభావం ఎన్నాళ్లు, ఏ మేరకు ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇక రెండో ప్రతిపాదన అంగీకరిస్తే రుణంపై వడ్డీ భారం రాష్ట్రంపై పడుతుంది. ఈ రుణం ఎఫ్​ఆర్​బీఎమ్​ పరిధిలో ఉండడం వల్ల రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడనుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎఫ్​ఆర్​బీఎమ్ పరిధిలో రుణం తీసుకుంటే ఇతర అభివృద్ధి పనులకు తీసుకునే రుణ పరిమాణం తగ్గిపోతుందని సర్కారు యోచిస్తోంది.

మంత్రి హరీశ్​‌రావు అభ్యంతరం

పరిహారం కోసం రాష్ట్రాలు రుణాలు తీసుకోవాలని చేసిన ప్రతిపాదనపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రమే రుణం తీసుకుని రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలన్నారు. ఐజీఎస్టీ మిగులు లక్షా 70 వేల కోట్లను రాష్ట్రాలతో ఏ మాత్రం సంప్రదించకుండా కేంద్రం కన్సాలిడేటడ్‌ ఫండ్‌కు జమచేయడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం సూచించిన మేరకు పన్నుల వాటా తరహాలో ఈ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే కేరళ, దిల్లీ, ఛత్తీస్‌గడ్‌ వంటి రాష్ట్రాలు కేంద్ర ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాయి.

ఒకసారి పరిశీలిస్తే

జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి పరిహారం చెల్పింపులను ఒకసారి పరిశీలిస్తే.. 2017-18 ఆర్థిక ఏడాదిలో 16 వేల 620 కోట్లు వచ్చింది. ఆ ఆర్థిక ఏడాదిలో మొదట మూడు నాలుగు నెలలు తక్కువ వసూళ్లు కావడం వల్ల.. 169 కోట్లు మాత్రమే పరిహారం వచ్చింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 24 వేల 820 కోట్లు వచ్చింది. పరిహారం ఏమీ రాలేదు. 2019-20 ఆర్థిక ఏడాదిలో 24 వేల 173 కోట్లు రాగా.. 3 వేల 34 కోట్లు పరిహారం అందింది. 2020-21 ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్‌ నుంచి జులై వరకు 4 వేల 915 కోట్లు వచ్చింది. 5 వేల 424 కోట్ల పరిహారం కేంద్రం నుంచి రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూపాయి కూడా పరిహారం అందలేదు.

ఇదీ చూడండి : నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.