నాయి బ్రాహ్మణులు నిర్వహిస్తున్న సెలూన్స్, రజకులు నిర్వహిస్తున్న లాండ్రి షాపులకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ పథకం ప్రయోజనాలు పొందుటకు హెయిర్ కటింగ్ సెలూన్, లాండ్రీ షాప్ నిర్వాహకులు తమ వివరాలను వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
మీసేవా కేంద్రాల్లో నమోదుకు అవకాశం
ఈ ప్రయోజనమును పొందుటకు సీజీజీ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని వినియోగదారులను ప్రభుత్వం కోరింది. ఇంకా కొంతమంది తమ వివరాలను రిజిస్టర్ చేసుకోలేదని.. ప్రతి ఒక్కరు సులభంగా రిజిస్టర్ చేసుకునేందుకు అన్ని మీ సేవ కేంద్రాలలో ఈ వసతిని కల్పించినట్లు తెలిపింది. నమోదు చేసుకోని హెయిర్ కటింగ్ సెలూన్ , లాండ్రీ షాప్ నిర్వాహకులు తమ వివరాలతో వెంటనే రిజిస్టర్ చేసుకొని.. ప్రభుత్వం ప్రకటించిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని వినియోగించుకోవాలని కోరింది.
ఇదీ చూడండి: