ETV Bharat / state

అత్యున్నతస్థితికి సాగునీటి రంగం.. సాహసోపేత చర్యలతో సరికొత్త అధ్యాయం! - government report on irrigation sector

Telangana Irrigation Sector: రాష్ట్ర సాగునీటి రంగం అత్యున్నత స్థితికి చేరుకుందని.. కోటి ఎకరాల మాగాణం అవుతోందని ప్రభుత్వం తెలిపింది. సర్కార్ సాహసోపేతమైన చర్యలతో సరికొత్త అధ్యాయం మొదలైందని.. ఇప్పటి వరకు సాగునీటి రంగంపై రూ.లక్షా 52 వేల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. తిరుగులేని విధంగా నీటి పారుదల రంగం స్థిరమైందని, తద్వారా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి తెలంగాణ.. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించిందని వివరించింది.

అత్యున్నతస్థితికి సాగునీటి రంగం.. సాహసోపేత చర్యలతో సరికొత్త అధ్యాయం!

author img

By

Published : Jun 19, 2022, 10:33 AM IST

అత్యున్నతస్థితికి సాగునీటి రంగం.. సాహసోపేత చర్యలతో సరికొత్త అధ్యాయం!

Telangana Irrigation sector: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చి.. చేపట్టిన సాహసోపేత చర్యలతో 8 ఏళ్లలోనే అత్యున్నత స్థితికి చేరిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 8 ఏళ్ల సాగునీటి రంగ ప్రగతిపై నివేదిక విడుదల చేసిన సర్కార్.. తెలంగాణ సస్యశ్యామలం కావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ చిరకాల వాంఛ నెరవేరడంలో ఎన్నో మైలురాళ్లున్నాయని పేర్కొంది. ప్రాజెక్టుల రూపకల్పన.. నిర్ధేశిత వ్యవధిలో పూర్తి చేసేందుకు పడిన తపన అంతా ఇంతా కాదని తెలిపింది. సీఎం తీసుకున్న వ్యూహాత్మక చర్యలతో ప్రాజెక్టులు అన్ని సరికొత్త రూపు సంతరించుకున్నాయని.. పాత ప్రాజెక్టులను విప్లవాత్మక రీతీలో ఆధునీకరించడంతో సాగునీటి విస్తీర్ణం పెరిగినట్లు వివరించింది. రాష్ట్ర అత్యవసరాలను దృష్ట్యా రీడిజైనింగ్, రీఇంజినీరింగ్ వంటి వినూత్న ప్రణాళికతో విజయవంతంగా ప్రాజెక్టులను చేపట్టినట్లు పేర్కొంది.

కల్వకుర్తి, నెట్టంపాడు, కోయల్ సాగర్, ఎల్లంపల్లి, మధ్యమానేరు, దేవాదుల తదితర ప్రాజెక్టులను పూర్తి చేయడంతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని తెలిపింది. డిండి, గట్టు ఎత్తిపోతల, చనాకా-కొరాటా తదితర ప్రాజెక్టు పనులు సాగుతున్నాయని.. నాగార్జునసాగర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ వంటి పాత ప్రాజెక్టుల కాలువలను ఆధునీకరించినట్లు పేర్కొంది. రూ.35 వేల కోట్లతో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని.. నిధుల కొరత రాకుండా కాళేశ్వరం కార్పొరేషన్‌తో అనుసంధానించినట్లు తెలిపింది. సీతారామ ఎత్తిపోతల పనులు కొనసాగుతున్నట్లు పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టు.. అందులో భాగంగా నిర్మించిన సొరంగాలు, జలాశయాలు.. సాగునీటి రంగ చరిత్రలోనే అద్భుతమని తెలిపింది. 90 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్లకు గోదావరి జలాలను ఎత్తిపోసే.. బృహత్తర కార్యాచరణ మూడేళ్లలో పూర్తైనట్లు వివరించింది. శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకానికి కాళేశ్వరం జలాలు వినియోగిస్తున్నట్లు పేర్కొంది. సముద్రంలోకి వృథాగా వెళ్లే.. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవటంలో.. తెలంగాణ సఫలీకృతమైందని వివరించింది.

సిరుల భూములుగా సాగు భూములు..: కాళేశ్వరం నిర్మాణంతో గోదావరిలో నిరంతరం 100 టీఎంసీల నిల్వతో పాటు 45 లక్షల ఎకరాలకి.. రెండు పంటలకు సాగునీరు అందుతోందని తెలిపింది. నీటి పారుదల రంగంలో జరిగిన అభివృద్దితో ఆయకట్టు 119 శాతం పెరిగినట్లు.. సర్కార్ వివరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల ద్వారా దాదాపు కోటి ఎకరాలకు నీరంది, సాగు భూములు సిరుల భూములు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. సాగునీటి రంగంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం రూ.లక్షా 52 వేల కోట్లకు పెరిగిందని తెలిపింది.

దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ..: 2014-15లో తెలంగాణ సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా.. 2020-2021 నాటికి 2.09 కోట్ల ఎకరాలకు పెరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. 2014-15 లో 68.17 లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తి కాగా.. 2020-21 నాటికి 2.18 కోట్ల టన్నులకు పెరిగినట్లు తెలిపింది. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించిందని పేర్కొంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు.. రైతులు చెల్లించాల్సి ఉన్న నీటితీరువా పన్ను బకాయిలను రద్దు చేయడంతో పాటు శాశ్వతంగా నీటి పన్ను రద్దుచేసి, అన్నదాతలకు ఉచితంగా సాగునీటిని అందిస్తున్నట్లు తెలిపింది. సాగునీటి రంగంలో ప్రభుత్వం చర్యలు సరికొత్త అధ్యాయంగా నిలుస్తున్నాయని.. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అవుతోందని ప్రకటించింది.

ఇవీ చూడండి..

డిస్కంలకు రూ. 8,925 కోట్లు.. ఉత్తర్వులు విడుదల చేసిన ఇంధనశాఖ

భారత్​లో కరోనా కలకలం.. కొత్తగా ఎన్ని కేసులంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.