తెరాస ఎమ్మెల్యే జి.సాయన్నకు హైదరాబాద్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది. సాయన్నపై గతంలో నమోదైన రెండు ఎన్నికల కేసులను కోర్టు కొట్టేసింది.
ఎన్నికల సమయంలో సాయన్న నిబంధనలు ఉల్లంఘించారని 2014లో పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టు ఆవరణలోని ప్రజా ప్రతినిధుల కేసుల ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. సాయన్నపై అభియోగాలకు ఆధారాలు లేవని రెండు కేసులను కొట్టివేస్తూ తీర్పులు వెల్లడించింది.
ఇదీ చదవండి: బోల్తా పడిన ప్రైవేట్ బస్సు... ముగ్గురు మృతి