పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ సేవలు చిరస్మరణీయమని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. నేడు వారి వర్ధంతిని పురస్కరించుకుని.. సిమ్లాలోని రాజ్ భవన్లో ఘనంగా నివాళులు అర్పించారు.
సమాజంలో కొందరు మరణించేవరకు జీవిస్తారని, మరికొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారని దత్తాత్రేయ పేర్కొన్నారు. పండిట్ రెండో కోవకు చెందుతారని చెప్పుకొచ్చారు. దూరదృష్టి, మానవతా విలువలు కలిగిన మహానాయకుడని కొనియాడారు.
పండిట్.. మూల సిద్ధాంతాలను తీసుకొని కేంద్రం పలు సంక్షేమ పథకాలను అమలు పరుస్తోందని దత్తాత్రేయ గుర్తు చేశారు. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన, జన్‌ధన్ యోజన, దీన్‌దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన, గ్రామీణ కౌసల్య యోజన వంటి పథకాలు.. వారి సిద్ధాంతాలకు అనుగుణంగా ఏర్పాటైనవేనని వివరించారు.
ఇదీ చదవండి: తొలిసారిగా ఇద్దరు మహిళలకు గ్రేటర్ పీఠం